Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKTR | తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు

KTR | తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, 22 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని అన్నారు

జూబ్లీహిల్స్ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి నేతృత్వంలోని టీడీపీ శ్రేణులను తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా ప్రజల స్పందన బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైన హామీల చిట్టాను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్‌ఎస్‌ ప్రారంభించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రచారం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ‘బ్రహ్మాస్త్రం’గా పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ కార్డులతో అధికారంలోకి వచ్చి, ప్రజలకు ‘మోసం’ తప్ప మరేమీ ఇవ్వలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు :

బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

RELATED ARTICLES
- Advertisment -

Latest News