Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Andhra university | ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతి...విద్యార్థి సంఘాల ఆందోళన

Andhra university | ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతి…విద్యార్థి సంఘాల ఆందోళన

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో(Andhra university) బీఈడీ విద్యార్థి మణికంఠ మృతి కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్లే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, మణికంఠ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని యూనివర్సిటీలోని వైద్య కేంద్రానికి తరలించారు. కానీ, అక్కడ ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడం వల్ల అతన్ని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్ కి తరలించేలోపే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. ఏయు (Andhra university) లో కనీస సోకార్యాలు లేనందు వల్లే మణికంఠ మృతి చెందాడని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మణికంఠ మరణానికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, యూనివర్సిటీ వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు:

విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన

RELATED ARTICLES
- Advertisment -

Latest News