Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణKonda Laxman Bapuji | 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Konda Laxman Bapuji | 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్

సామాజిక తెలంగాణ స్వాప్నికులు, మూడు తరాల తెలంగాణ ఉద్యమ యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకను తమ 7 సంవత్సరాల ప్రజా పోరాటాల ఫలితంగా ఏర్పాటైన ట్యాంక్ బండ్ పై గల జలదృశ్యం వద్ద ఘనంగా నిర్వహించనున్న‌ట్లు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు..

Konda Laxman Bapuji birthday will be celebrated at Jaladrishyam

రాజ్యాధికారం సబ్బండ వర్గాల జన్మ హక్కు అనే ఇతివృత్తంతో సామాజిక తెలంగాణ సాధన దిశగా కొనసాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ , ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వివిధ పార్టీల చీఫ్ లకు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపనున్నామని దాసు సురేశ్ మీడియాకు తెలిపారు. ప్రతీయేటా పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, బాపూజీ అభిమానులు ,సబ్బండ వర్గాల నాయకులు, వివిధ కుల , ప్రజా , విద్యార్థి ,ఉద్యమ సంఘాలు పాల్గొనే ఈ తెలంగాణ ఆత్మగౌరవ ,అస్తిత్వ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Latest News