Tuesday, October 28, 2025
ePaper
HomeతెలంగాణKalvakuntla Kavitha | కుల గణన వివరాలు బయటపెట్టాలి... ప్రభుత్వానికి కవిత డిమాండ్

Kalvakuntla Kavitha | కుల గణన వివరాలు బయటపెట్టాలి… ప్రభుత్వానికి కవిత డిమాండ్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి ఒక కీలకమైన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు ప్రతీ గ్రామ పంచాయతీలో జరిగిన కుల గణన వివరాలను బయటపెట్టాలని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

కుల గణన వివరాలను ప్రజలకు చెప్పకుండా, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కవిత ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో రిజర్వేషన్లు కేటాయించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే కుల గణన వివరాలు బయటపెట్టి, ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవిత అన్నారు.

“రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలను తొందరగా నిర్వహిస్తే, అది బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుంది. కుల గణన వివరాలను ప్రతీ గ్రామ పంచాయతీకి వెల్లడించాలి,” అని కవిత(Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, రిజర్వేషన్లు పెరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల వల్ల బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన కవిత(Kalvakuntla Kavitha), ఆ పార్టీ కి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, ఆమె మంగళవారం మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News