Friday, October 3, 2025
ePaper
Homeబిజినెస్moto | సరికొత్త మోటో పాడ్ 60 నియో తో విస్తరిస్తున్న మోటరోలా

moto | సరికొత్త మోటో పాడ్ 60 నియో తో విస్తరిస్తున్న మోటరోలా

  • ఈ సెగ్మెంట్ అత్యంత సన్నని, తేలికైన 5G-రెడీ టాబ్లెట్, కేవలం ₹12,999* ధరకే
  • భారతదేశంలో తన ఎకోసిస్టమ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తున్న మోటరోలా

మొబైల్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి, భారతదేశ ప్రముఖ AI స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన మోటరోలా, భారతదేశంలో తన ఎకోసిస్టమ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు, ఈరోజు సరికొత్త మోటో పాడ్ 60 నియో ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వినోదం, సృజనాత్మకత, ఉత్పాదకతను సజావుగా మిళితం చేయడానికి రూపొందించబడిన ఈ టాబ్లెట్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఏకైక 11” 2.5K డిస్‌ప్లేతో తన విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. రాయడం, స్కెచింగ్, తక్షణ శోధన కోసం బాక్స్ లోపల మోటో పెన్ తో బండిల్ చేయబడింది. కేవలం 490 గ్రా. బరువు, 6.9 మి.మీ. సన్నని కొలతలు కలిగిన మోటో పాడ్ 60 నియో తన తరగతిలో అత్యంత తేలికైన, సన్నని 5G-రెడీ టాబ్లెట్. ఇది ప్రయాణంలో ఉపయోగించడానికి అనువు గా ఉంటుంది. సులభమైన ఫైల్ బదిలీ, స్క్రీన్ షేరింగ్, క్రాస్ డివైస్ కంట్రోల్ కోసం అధునాతన స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా శక్తివంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్, స్ట్రీమింగ్, గేమింగ్, మరిన్నింటికి సున్నితమైన పనితీరును అందిస్తుంది. అన్నీ ప్రీమియం పాంటోన్-క్యూరేటెడ్ బ్రాంజ్ గ్రీన్ డిజైన్‌లో చుట్టబడి ఉంటాయి.

మోటో పాడ్ 60 నియో ఈ విభాగంలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ విభాగంలో ఒకేఒక్క 11-అంగుళాల 2.5K డిస్‌ప్లేగా పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మోటరోలా స్మార్ట్ కనెక్ట్ ఇంటిగ్రేషన్మోటో పాడ్ 60 నియో ని ఏవైనా స్మార్ట్‌ఫోన్లు, పీసీలతో ఏకీకృతం చేస్తుంది. ఇది సులభమైన క్రాస్-డివైజ్ వర్క్‌ఫ్లోలను అనుమతిస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది. క్రాస్ కంట్రోల్‌తో, వినియోగదారులు తమ ఫోన్, పీసీ, టాబ్లెట్‌ను ఒకే కీబోర్డ్, మౌస్‌ని ఉపయోగించి ఆపరేట్ చేయవచ్చు.

మోటరోలా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టి.ఎం. నరసింహన్ మాట్లాడుతూ, “మోటరోలాలో, నిజమైన ఆవిష్క రణ అంటే రోజువారీ జీవితాన్ని సుసంపన్నం చేసే, సరళీకరించే అనుభవాలను సృష్టించడం. సరికొత్త మోటో పాడ్ 60 నియో ప్రారంభంతో, స్మార్ట్‌ఫోన్‌లకు మించి సజావుగా, సహజమైన పరికర పర్యావరణ వ్యవస్థ అనే మా దృష్టిని మేం విస్తరిస్తున్నాం. ఈ ఆవిష్కరణ ఉద్దేశపూర్వక సాంకేతికత, కాలానికి అతీతమైన రూపకల్పన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిష్కారాలతో వినియోగదారులను శక్తివంతం చేయడం పట్ల మా నిబద్ధతను ప్రతి బింబిస్తుంది. పరిశ్రమలో అగ్రగామి లక్షణాలను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం మా పోర్ట్‌ఫోలియో ను పెంచుకుంటున్నప్పుడు, నేటి వినియోగదారులతో మమేకమయ్యే, జీవనశైలి సాంకేతికతలో మా నాయక త్వాన్ని బలోపేతం చేసే అర్థవంతమైన ఆవిష్కరణలను అందించడంపై మేం దృష్టి సారిస్తాం’’ అని అన్నారు.

మోటో పాడ్ 60 నియో ఒకే కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది: 128GB స్టోరేజ్ 8GB LPDDR4x RAM.
ఈ వేరియంట్‌లు అద్భుతమైన పాంటోన్-క్యూరేటెడ్ బ్రాంజ్ గ్రీన్ రంగులో అందించబడతాయి. ధర: ₹12,999

RELATED ARTICLES
- Advertisment -

Latest News