Wednesday, October 29, 2025
ePaper
Homeతెలంగాణతెలంగాణ జాగృతిలో చేరిన యువనాయకుడు గండికోట కుమార్

తెలంగాణ జాగృతిలో చేరిన యువనాయకుడు గండికోట కుమార్

  • కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక..
  • సాదరంగా ఆహ్వానించిన జాగృతి నాయకురాలు కవిత..
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు..
  • కవిత నాయకత్వం మీద నమ్మకం ఉందన్న కుమార్..
  • బీసీ వర్గాలకు కవితతోనే న్యాయం జరుగుతుందని వ్యాఖ్య..
  • ఎంతవరకైనా కవితక్కతో కలిసి నడుస్తామని వెల్లడి..
  • గండికోట కుమార్ లాంటి యువకుల అవసరం ఎంతైనా ఉందన్న కవిత..
  • మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలో సరికొత్త సంచలనానికి నాంది పడిందని వెల్లడి..
  • కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపిన గండికోట కుమార్..

తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుగబోతున్న శుభతరుణంలో ఒక శుభపరిణామం చోటుచేసుకుంది.. గత కొద్ది కాలంగా వార్తల్లో కేంద్రబిందువుగా నిలుస్తున్న తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. అతను ఒక చురుకైన యువనాయకుడు.. ఆమె అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళా నాయకురాలు.. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. ప్రజా సంక్షేమ కాంక్షతో ముందుకు వెళుతున్న ఆమెతో ఆ యువనాయకుడు చేతులు కలిపాడు..

ఇక రాబోవు రాజకీయాల్లో సంచనాలకు నాంది పలుకబోతున్నారు.. పాత్రికేయుడిగా, వ్యాపారవేత్తగా, సంస్థాగత రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న గండికోట కుమార్ గురువారం నాడు తెలంగాణ జాగృతి అధినాయకురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో, ఆమె సమక్షంలో జాగృతి కండువా కప్పుకున్నారు.. ఆమె ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తానని ప్రమాణం చేశాడు.. ఈ పరిణామంతో కవిత ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.. ఇలాంటి యువత అవసరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎంతైనా ఉందని అన్నారు.. గండికోట కుమార్ ని సాదరంగా ఆహ్వానించారు.. తెలంగాణ జాగృతి సంస్థలో ఒక విన్నూత్న పరిణామం చోటుచేసుకుంది.. తెలంగాణ జాగృతి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి

YouTube player

మారయ్య ఆధ్వర్యంలో.. గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం, శామీర్ పేట మండలం, అలియాబాద్ మున్సిపల్ కు చెందిన యువ నాయకుడు గండికోట కుమార్ జాగృతిలో భాగస్వామ్యం అయ్యారు.. కల్వకుంట్ల కవిత జాగృతి కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి గండికోట కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం అని కవిత వ్యాఖ్యానించారు.. ఇలాంటి యువరక్తం ఇప్పుడు ఎంతో అవసరం అని తన భావాలను గౌరవించి, తన పోరాటానికి మద్దతుగా యువకుడైన గండికోట కుమార్ జాగృతిలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.. ఈ సందర్భంగా యువ నాయకుడు గండికోట కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల అభ్యున్నతి కోసం, అలాగే సామాజిక తెలంగాణ కోసం కల్వకుంట్ల కవిత ఎంతగానో పోరాడుతున్నారని, ఆమె నిస్వార్ధ పోరాటానికి ఆకర్షితుడినై తాను జాగృతిలో భాగస్వామినైయానై అన్నారు..

కవితక్క పోరాటంలో తానుకూడా వెన్నంటి ఉంటానని, ఆమె ఆధ్వర్యంలో కలిసి పని చేస్తానని అన్నారు. తెలంగాణాలో తిరుగులేని మహిళా నాయకురాలిగా, విషయపరిజ్ఞానం మెండుగా కలిగిన మేధావిగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెరవని మనస్తత్వం కలిగిన నాయకురాలిగా పేరొందిన కవితక్కతో కలిసి నడవడం తనకు అత్యంత సంతోషంగా ఉందని.. జాగృతి తరఫున ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానని, కవితక్క భావాలను, ఆలోచనలను తు.చ. తప్పకుండా ఆచరిస్తానని కుమార్ తెలిపారు.. వార్డు మెంబర్ గా పనిచేసిన తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని, వారి శ్రేయస్సుకోసం పనిచేస్తానని తెలిపారు.. పాత్రికేయుడిగా సమాజం పట్ల ఖచ్చితమైన, ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, ఆలోచన ఉందని అన్నారు.. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కల్వకుంట్ల కవితకు కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు ఎత్తరి గణేష్, దండుగుల మహేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News