Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణdomestic violence : మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌వాలి

domestic violence : మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌వాలి

  • గృహహింస కేసులకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం వహించద్దు
  • జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డా.అర్చన మంజుదార్

మహిళలపై జరిగే హింసాత్మక చర్యలను, వేధింపులను నివారించడానికి తమ వంతు సహకారం అందించాలని, మహిళలకు అండగా నిలవాలని సంబంధిత అధికారులను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్ ఆదేశించారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమానికి గౌరవ అతిథిగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులు డా.అర్చన మంజుదార్ పాల్గొన్నారు. ‘జన సునవాయి’ పేరుతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధిత మహిళలు అందించిన పలు ఫిర్యాదులను ఆమె పరిశీలించి, వివిధ రకాల సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు అధికార యంత్రాంగం అండగా నిలవాలని, తగిన విధంగా తోడ్పాటు అందించాలని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు పేర్కొన్నారు. వారు అందించే వినతులు, పోలీసు కేసుల విషయంలో చొరవ చూపాలని, పరిపాలనాపరమైన, న్యాయపరమైన సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందించాలని సూచించారు.

క్లిష్టమైన పరిస్థితుల్లో భరణం వచ్చేలా, స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు సూచించారు. ముందుగా బాధితుల సమస్యలను అర్చనా మజుందార్‌ విన్నారు. కేసు పూర్వాపరాలను, తాజాస్థితి, ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులు మరింత చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మహిళలు 56 వినతులను ఆమెకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన కేసులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని 56 పెండింగ్ కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. గృహహింస కేసులకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం వహించద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ళ శారద, డిఎస్స్పిలు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, సంబంధిత అధికారులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News