Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఆదాబ్ ప్రత్యేకంకాంగ్రెస్ వెనుకడుగు..!

కాంగ్రెస్ వెనుకడుగు..!

  • మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణలో ఎందుకు జాప్యం..?
  • మిషన్ భగీరథలో అవినీతి అంటూ కాంగ్రెస్ ఆరోపణలు
  • ఆ ఇంజినీర్లకు లగ్జరీ కార్లు, విల్లాలు ఎక్కడివి..!
  • పనులు పూర్తి కాకముందే బిల్లులు ఎలా క్లియర‌య్యాయి?
  • విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశాలివ్వట్లేదు..?
  • మిషన్ భగీరథలో ఎవరినీ కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన‌క్కి త‌గ్గింది..?
  • భగీరథలో అవినీతిపై త్వరలో “ఆదాబ్ హైదరాబాద్” ప్రత్యేక కథనం

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథపై అవినీతి ఆరోపణలు మళ్లీ ముదురుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నేతలు పదేపదే ఈ పథకంలో వందల కోట్ల అవినీతి జరిగిందని బహిరంగంగానే ఆరోపించినా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ముందడుగు వేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హయాంలో చేపట్టిన ఈ పథకంలో పని చేసిన పలువురు ఇంజినీర్లు అక్రమ సంపాదన చేసి విలాసవంతమైన కార్లు, కోట్ల రూపాయల విల్లాలు, ఖరీదైన లైఫ్ స్టైల్‌కు అలవాటు పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

అయితే, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ పథకం పేరును మిషన్ భగీరథగా ఎందుకు మార్చింది…? గతంలో మాజీ మంత్రి కేటీఆర్ హాయంలో కోట్లాది రూపాయాల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు ఎటుపాయే..? ఆ పథకంలో పనిచేసిన ఇంజినీర్లకు లగ్జరీ కార్లు, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? కుటుంబ ఫంక్షన్‌ల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి…? అంటే భగీరథలో వారు దోచుకున్న సొమ్మే కాదా..! రాష్ట్రంలో కేవలం ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ ఇంజినీర్లపైనే ప్రభుత్వం విజిలెన్స్ అధికారుల విచారణలు చేయిస్తారా..! మిషన్ భగీరథలో భాగస్వాములైన ఇంజినీర్లపై ఎందుకు చర్యల్లేవు..? పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకున్న కాంట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి.. అక్రమ మార్గాల్లో ధనార్జన చేశారంటూ గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు వచ్చాయి.. అయిన వారిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయకపోవడం వెనక ఉన్న మతలబేంటి.. మిషన్ భగీరథ ఇంజినీర్లపై రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ, ఇరిగిషన్ మరియు ఇతర ఇంజినీరింగ్ సంఘాలు పదే పదే చేస్తున్న ఆరోపణల ఈ నేపథ్యంలో “ఆదాబ్ హైదరాబాద్” ప్రత్యేక కథనం ద్వారా త్వరలో మీ ముందుకు తీసుకురానుంది..

మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, ఇంజనీర్ల సంఘాలు అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. సింగిల్ టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టులు కేటాయించి కోట్లు లంచాలుగా వసూలు చేసినట్లు ఆరోపణలు, ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు వహించిన కొంతమంది ఇంజనీర్ల‌పై ఏసీబీ తక్షణమే దర్యాప్తు చేపట్టి, నిజానిజాలు బయటపెట్టాలని ఇంజనీర్ల సంఘాల కోరుతున్నాయి.. ప్రజల పన్నుల రూపేనా నిర్మితమైన మిషన్ భగీరథలో అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరమని సంఘాలు పేర్కొన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అవి స్పష్టం చేశాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News