Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ 3వేల కోట్ల దోపిడీ

లిక్కర్‌ స్కామ్‌లో జగన్‌ 3వేల కోట్ల దోపిడీ

  • మద్యనిషేధం పేరుతో 30వేల మహిళల తాళ్లు తెంచారు
  • కాకాణి అక్రమాలు, భూ దందాలు బయట పెడతా
  • విలేకర్ల సమావేశంలో సోమిరెడ్డి హెచ్చరిక

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌ అండ్‌ కో రూ.3 వేల కోట్లు దోచుకున్నారని మాజీమంత్రి, సర్వేపల్లి టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మధ్య నిషేధం అని చెప్పి 30వేల మంది మహిళల తాళ్లు తెంచిన ఘనత వైసీపీదేనని ఆక్షేపించారు. గురువారం నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకాణి గోవర్థన్‌రెడ్డికి టీడీపీని, తనను తిట్టందే తిన్నది అరగదని… తిన్నది అరగక ఆపరేషన్‌ చేయించుకున్నది కాకణినేనని ఎద్దేవా చేశారు. కాకాణి, రామిరెడ్డిపై ఎనిమిది కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్‌ సిక్స్‌ సభను ప్రజలు విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.

నెల్లూరులో సాగరమాల నేషనల్‌ హైవే రోడ్డు పనులు అద్భుతంగా జరుగుతున్నాయని వివరించారు. ఏఎంఆర్‌, మేకపాటి కుటుంబ సభ్యులు నిజాయితీగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రావెల్‌, ఇసుకకు వారు డబ్బులు కట్టి తోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ నిర్మాణ పనులను వైసీపీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి చేసిన భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని హెచ్చరించారు.. కాకాణివి అన్ని నిరాధార ఆరోపణలే. ఆయన చేసిన అవినీతి, అన్యాయాల నుంచి తప్పించుకోలేడు. కాకాణికి అవినీతి, అక్రమాలు, దోపిడీలు చేసిన దాంట్లో పీహెచ్‌డీ చేసిన అనుభవం ఉంది. 204 రోజులు తప్పించుకొని తిరిగి ఆజ్ఞాతంలో ఉన్న వ్యక్తిని జగన్‌ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా చేశాడు. కాకణికి దోపీడీలో పీహెచ్‌డీ క్రింద డాక్టరేట్‌ ఇవ్వాలి. పుచ్చలపల్లి, నల్లపురెడ్డి, నేదురుమల్లి, బెజవాడ లాంటి వాళ్లు ఏలిన నెల్లూరు జిల్లాలో.. కాకాణి లాంటి వారిని జిల్లాలో చూడాల్సి వస్తోంది. మేము అధికారంలోకి వస్తే అని కాకాణి బెదిరిస్తున్నాడు.. మేము భయపడం. కోర్టు ఆర్డర్‌ను కాకణి లెక్క చెయడం లేదని.. ఆయన బెయిలును రద్దు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News