- మిర్యాలగూడ డిఎస్పీ కె. రాజశేఖర్ రాజు
- అవంతిపురం గురుకులంలో నియోజకవర్గస్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ప్రారంభం
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని, క్రీడల వలన మానసిక, శారీరక వికాసంతో పాటు, క్రమశిక్షణ అలవడుతుందని మిర్యాలగూడ డి.ఎస్.పి కె రాజశేఖర్ రాజు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం అవంతిపురం లోని గురుకులంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలను డిఎస్పి రాజశేఖర్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితాలలో క్రీడలు భాగం కావాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని అధిగమించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నారు.

ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ దగ్గుబాటి విమల మాట్లాడుతూ జిల్లాలోని మొట్టమొదటి నియోజకవర్గ స్థాయి క్రీడలు మిర్యాలగూడ లో నిర్వహిస్తున్నందుకు వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈఓ రావూరి బాలు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు విచ్చేసిన ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో మంచి ఆటను ప్రదర్శించాలని కోరారు. ఎస్ జి ఎఫ్ మిర్యాలగూడ కన్వీనర్ శోభారాణి మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వహణకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, క్రీడల నిర్వహణ కోసం గ్రౌండ్ ఇచ్చి సహకరించిన ప్రిన్సిపాల్ జాను నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తహసిల్దార్ సురేష్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్లగడప మాజీ సర్పంచ్ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి, సురేందర్ రెడ్డి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పి సైదులు, కే మనోహరి, కే వెంకటయ్య ఎండి షాహిద్, ఏ యుగంధర్ రెడ్డి, అరుణమ్మ ఇందిరా సావిత్రి నాగలక్ష్మి అనిల్ జోజి తదితరులు పాల్గొన్నారు.