- ఎప్పడు ఎలా మాట్లాడుతాడో చెప్పలేం
- ట్రాంప్ వ్యాఖ్యలపట్ల జాగ్రత్తగా ఉండాలి
- కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ సూచన
ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయన్నారు. భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని నరేంద్రమోదీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని త్వరగా స్పందించినప్పటికీ, రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని తెలిపారు. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చాలా త్వరగా స్పందించారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం. రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను.
భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉందని థరూర్ మాట్లాడారు. భారత్ విషయంలో తప్పు చేశానని ట్రంప్‌నకు అర్థమైంది కాబట్టే స్వరం మార్చారని ఇండియా మాజీ దౌత్యవేత్త కేపీ ఫాబియన్ అన్నారు. దూకుడుగా ముందుకెళ్లి తప్పుచేసినట్లు ట్రంప్ గ్రహించారని పేర్కొన్నారు. రష్యా చమురుకొంటే 25 శాతం అదనపు సుంకం విధించడం ట్రంప్‌నకు ఆశించిన ఫలితం ఇవ్వలేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు తగినట్లు-గా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. కానీ, దీనితోనే వివాదం ముగిసిపోయిందనే నిర్థరణకు రాకూడదు. ఇండియా ఎప్పటికీ ఇండియాగానే ఉంటుంది. ఇండియా నాగరిక దేశం. భారత్ మరే ఇతర దేశాన్ని అనుసరించదు. ప్రతిఒక్క దేశంతో స్నేహ సంబంధాలు కోరుకుంటు-ంది. వ్యాపారం చేస్తుంది. కానీ, ఇతరుల ఆదేశాలకు తలొగ్గదు’ అని ఫాబియన్ చెప్పారు.