- ఎన్డీఎ కూటమి అభ్యర్థికే మా ఓటు
- కూటమిలో ఉంటూ ఇతరలకు ఓటెలా వేస్తాం
- ఉపరాష్ట్రపతి అయినా.. మరే ఎన్నికైనా ఒకే నిర్ణయం
- హిందీ నేర్చుకోవడంలో తప్పులేదు…
- విద్యార్థులు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు
- ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్లో మంత్రి లోకేశ్
తమ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎల్లప్పుడూ మద్దతు చేస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి తమ మద్దతు ఉంటుందన్నారు. టీడీపీ ఎన్డీఏలో చేరిందని, మేము ఈ కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇండియా టుడే సౌత్ కాన్క్లేవ్ 2025కు ఆంధప్రదేశ్ మంత్రి, యువ నేత నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిగిన కీలక ప్రశ్నలకు లోకేష్ స్పష్టమైన సమాధానం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ అభ్యర్థిని మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. సరైన సమయం, సరైన స్థలం, సరైన నాయకత్వం అన్నీ కలిస్తేనే గొప్ప మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అది ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా, ఇతర ఎన్నికలైనా మా స్టాండ్ క్లియర్‌గా ఎన్డీఏ అభ్యర్థికే ఉన్నట్లు తెలిపారు. ఎన్డీఏ మొదట తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, తన ఎంపీలతో కలిసి ఢిల్లీలో సీపీ రాధాకృష్ణన్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు లోకేష్ గుర్తు చేశారు. కానీ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని తర్వాత ప్రకటించిందని అన్నారు. అప్పటికే టీడీపీ మద్దతు సీపీఆర్‌కు ప్రకటించినట్లు చెప్పారు. మేము సీపీఆర్కి సపోర్ట్ చేస్తున్నామని వాళ్లకు తెలుసు. అయినా, వాళ్లు కావాలనే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని, అలాంటి రాజకీయాలకు మేము లొంగమని లోకేష్ స్పష్టం చేశారు.
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి. తెలుగు వ్యక్తికి విూరు ప్రాధాన్యత ఇస్తారా లేదా జాతీయ రాజకీయాలా అని అడిగినప్పుడు, లోకేష్ టీడీపీ స్లోగన్.. భారత్ ఫస్ట్ అని పేర్కొన్నారు. మా ఎజెండా భారత్ ఫస్ట్. ఇది చాలా క్లియర్. దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వానికి మేము సపోర్ట్ చేస్తామన్నారు. మోదీ నాయకత్వానికి 100 శాతం మద్దతు ఇస్తామని, ఉపరాష్ట్రపతి ఎన్నికల వల్ల మా ఫోకస్ మారదని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించినప్పుడు..లోకేష్ చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని వివరించారు. చంద్రబాబు రెండు కళ్లూ ఆంధ్రప్రదేశ్‌పైనే ఉన్నాయని, ఆయన లక్ష్యం ఒకటే. ఆంధ్రప్రదేశ్‌ని నంబర్ వన్ రాష్ట్రంగా మార్చడం. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మేము గల్లీ లీడర్స్, ఢిల్లీ లీడర్స్ కాదన్నారు. మాకు గల్లీ పొలిటిక్స్ ఇష్టం. మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా గోల్ అని రూమర్స్‌కి ఫుల్స్టాప్ పెట్టారు. 2029 ఎన్నికల వరకు మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని నారా లోకేశ్ సమర్థించారు. నూతన జాతీయ విద్యావిధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని చెబుతున్నప్పటికీ ఎక్కడా హిందీ తప్పనిసరి అని చెప్పలేదని అన్నారు. ’నేను దిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాను. మాతృభాషలో బోధనపై దృష్టిపెట్టాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక భారతీయుడిగా మాతృభాష ప్రాధాన్యం నాకు తెలుసు. అలాగే హిందీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
తన సొంత అనుభవాన్ని లోకేశ్ వివరిస్తూ తాను కూడా మూడు భాషలు నేర్చుకున్నానని వెల్లడిరచారు. ’నేను మూడు భాషలు నేర్చుకున్న విద్యార్థిని. నా కుమారుడు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ పిల్లలు ఐదు భాషలు నేర్చుకుంటున్నారు. జర్మన్, జపనీస్ ఇలా ఎన్నో భాషలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే ఆ దేశాల్లో పని చేయడానికి వీలవుతుందని వివరించారు. ఉత్తరాది రాష్టాల్ల్రో కూడా దక్షిణాది భాషలు నేర్చుకోవాలా? అని ప్రశ్నించగా ’ఎందుకు నేర్చుకోకూడదు? ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఒడియా, తమిళ్, కన్నడ మాధ్యమాల్లో బోధించమని ఆదేశాలు జారీ చేస్తున్నాం. పిల్లలు తాము కోరుకునే భాష నేర్చుకోవాలి. రాజకీయ నిర్ణయాల ఆధారంగా అది జరగకూడదు’ అని పేర్కొన్నారు.