Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. అచ్చువేల్లి గ్రామంలోని 3వ కేంద్రం (492 మంది ఓటర్లు) మరియు కొత్తపల్లె గ్రామంలోని 14వ కేంద్రం (1273 మంది ఓటర్లు)లో ఈ రోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. భారీ పోలీసు భద్రత మధ్య ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పులివెందుల స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News