Wednesday, October 29, 2025
ePaper
Homeతెలంగాణధైర్యంగా ఉండండి..

ధైర్యంగా ఉండండి..

  • బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది
  • కాళేశ్వరంపై తప్పుడు ప్రచారానికి తిప్పికొట్టాలి
  • బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ నివేదిక అంశంపై ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంతో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎంతటి ప్రయోజనం కలిగిందో ప్రజల్లోకి మళ్లీ విస్తృతంగా తీసుకెళ్లాలని, ఇది కాళేశ్వ‌రం క‌మిష‌న్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రాజకీయ క‌మిష‌న్ మాత్రమే అని మండిపడ్డారు. కమిషన్ నివేదిక వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పారు. అలాగే, కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఎవ్వరూ భయపడవద్దు. ధైర్యంగా ఉండాలని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News