Saturday, October 4, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీవారికి విలువైన బంగారు శంఖు, చక్రాల విరాళం

శ్రీవారికి విలువైన బంగారు శంఖు, చక్రాల విరాళం

  • రూ.2.40 కోట్ల విలువైన ఆభ‌ర‌ణాలు అంద‌జేత‌
  • చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ దాతృత్వం

భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మంగళవారం మరో విలక్షణమైన శ్రద్ధార్పణ జరిగింది. చెన్నైకు చెందిన ప్రముఖ సంస్థ సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున శ్రీవారికి సుమారు రూ.2.40 కోట్లు విలువైన రెండు బంగారు ఆభరణాలు ఒకటి శంఖం, మరొకటి చక్రం విరాళంగా అందజేయబడ్డాయి. ఈ బంగారు శంఖు, చక్రాలన్నీ కలిపి సుమారు 2.5 కిలోలు బరువు ఉండగా, స్వర్ణంతో అత్యంత నైపుణ్యంతో తయారు చేయబడి, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదిగా చేయబడ్డాయని టీటీడీ వర్గాలు తెలిపాయి.

ఈ శంకుశక్రాలను రంగనాయకుల మండపం వద్ద టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా దాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ సంస్థ తరఫున శ్రీవారికి సేవచేయడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇది వ్యాపార విజయాల కంటే పైగా ఒక ఆధ్యాత్మిక యజ్ఞంగా చూచుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సంప్రదాయ విశ్వాసానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ విరాళం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News