Friday, September 12, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి

2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని బిహార్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇటీవల భారత్‌- పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు ఇక్కడికి రావడంపై కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది. దీనిపై భారత క్రీడా మంత్రిత్వ శాఖ కీలక అప్డేట్‌ ఇచ్చింది.ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ పాల్గొనడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా పేర్కొంది. ఈ విషయంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు భారత్‌కు రావడంపై షరతులు లేవని తెలిపింది. ‘భారత్‌లో ఏ టోర్నమెంట్‌లోనైనా ఆడేందుకు ఏ జట్టుకు కూడా మేం వ్యతిరేకం కాదు. కానీ, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం మా వైఖరి వేరుగా ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వశాఖ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. కాగా ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News