Wednesday, October 29, 2025
ePaper
Homeజాతీయంకొన్ని వస్తువులపై జిఎస్టీ భారం తగ్గింపు

కొన్ని వస్తువులపై జిఎస్టీ భారం తగ్గింపు

ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం

ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించం లేదా ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న అనేక వస్తువులను దిగువన 5 శాతంలోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోంది. ఈ అరేంజ్‌మెంట్ మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్‌పేస్ట్‌, టూత్‌ పౌడర్‌, కుట్టు యంత్రాలు, ప్రెషర్‌ కుక్కర్లు మరియు వంటగది పాత్రలు, ఎలక్టిక్ర్‌ ఐరన్‌లు, గీజర్‌లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్‌ మెషీన్లు, సైకిళ్లు, రూ. 1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్‌ దుస్తులు, రూ. 500 నుండి రూ. 1,000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్‌ టైల్స్‌, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్పులు అమలు చేయబడితే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరలకు వస్తాయి.

మరోవైపు, ప్రభుత్వం సరళీకృతమైన, సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తోంది. అయితే, ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు భారాన్ని మోపుతుందని తెలుస్తోంది. అయితే, వినియోగం పెరిగితే జీఎస్టీ వసూల్లు పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు, కేంద్రం ఈ చర్యలకు ఒప్పుకున్నా రాష్టాల్రు ఏ విధంగా భావిస్తాయనేది చూడాలి. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్‌ చరిత్రలో ఒకసారి మాత్రమే ఓటింగ్‌ జరిగింది. ప్రతీ నిర్ణయం కూడా ఏకాభిప్రాయం ప్రకారమే తీసుకుంది. ఈ నెల చివర్లో జరిగే 56వ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News