Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్టి20 పవర్‌ ప్లేలో సరికొత్త రూల్స్‌

టి20 పవర్‌ ప్లేలో సరికొత్త రూల్స్‌

బౌలర్లకు అనుకూలంగా కొత్త నిబంధనలు

ప్రస్తుతం క్రికెట్‌లో టి20 ఫార్మాట్‌ హవా నడుస్తుంది. ఐపీఎల్‌ రాకతో టి20లకు మరింత క్రేజ్‌ పెరిగిపోయింది. ఫ్యాన్స్‌ కూడా టి20లను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఫ్యూచర్‌లో టెస్టు ఫార్మాట్‌, టి20లకు మాత్రమే ఆదరణ ఉండే అవకాశం ఉంది. వన్డేలు కనుమరుగవ్వడం ఖాయం.ఇక టి20ల్లో జూలై నుంచి కొత్త రూల్స్‌ రానున్నాయి. ఇందుకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. టి20ల్లో జూలై నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందులో పవర్‌ ప్లేకు సంబంధించిన రూల్స్‌ అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. బౌలర్లకు అనుకూలంగా ఐసీసీ రూల్స్‌ ఉన్నాయి. టి20 ఫార్మాట్‌లో పవర్‌ ప్లే 6 ఓవర్ల పాటు ఉంటుంది. అంటే మొదటి ఆరు ఓవర్లలో 30 గజాల సర్కిల్‌లోనే 9 మంది ప్లేయర్లు ఉండాల్సి ఉంటుంది. ఆ సర్కిల్‌ బయట కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. పవర్‌ ప్లే ముగిసిన తర్వాత 30 గజాల సర్కిల్‌ బయట 5గురు ప్లేయర్లు ఉంటారు. ఇక వర్షంతో మ్యాచ్‌ కుదించినపుడు పవర్‌ ప్లేలో మార్పులు ఉంటాయి. అయితే ఇంతకుముందు ఓవర్ల ప్రకారం కుదించిన పవర్‌ ప్లే ఉండేది. అయితే ఇకపై అది బంతుల లెక్కన ఉండనుంది. ఉదాహరణకు వర్షం కారణంగా మ్యాచ్‌ ఇన్నింగ్స్‌కు ఐదు ఓవర్ల పాటు కుదించాల్సి వస్తే.. అప్పుడు పవర్‌ ప్లే 1.3 ఓవర్లు ఉంటుంది. అంటే 9 బంతులుగతంలోనూ ఇది ఉండేది.

అయితే 1.3 ఓవర్లను 2 ఓవర్లకు మార్చేవారు. అయితే ఈసారి కచ్చితత్వం ఉండాలనే ఉద్దేశంతో బంతుల లెక్కన పవర్‌ ప్లే ఉండనుంది. 5 ఓవర్లకు 1.3 బంతులు పవర్‌ ప్లే ఉంటుంది. 6 ఓవర్ల ఇన్నింగ్స్‌కు 1.5 ఓవర్లు.. అంటే 11 బంతులు పవర్‌ ప్లే ఉంటుంది.7 ఓవర్లకు 2.1 ఓవర్లు.. 8 ఓవర్లకు 2.2 ఓవర్లు.. 9 ఓవర్లకు 2.4 ఓవర్లు.. 10 ఓవర్లకు 3 ఓవర్లు.. 11 ఓవర్లకు 3.2 ఓవర్లు.. 12 ఓవర్లకు 3.4 ఓవర్లు.. 13 ఓవర్లకు 3.5 ఓవర్లు.. 14 ఓవర్లకు 4.1 ఓవర్లు.. 15 ఓవర్లకు 4.3 ఓవర్లు.. 16 ఓవర్లకు 4.5 ఓవర్లు.. 17 ఓవర్లకు 5.1 ఓవర్లు.. 18 ఓవర్లకు 5.2 ఓవర్లు.. 19 ఓవర్లకు 5.4 ఓవర్ల చొప్పున పవర్‌ ప్లే ఉండనుంది.ఇక వైడ్స్‌ విషయంలోనూ రూల్స్‌ మారనున్నాయి.

వన్డే, టి20ల్లో బంతి లెగ్‌ సైడ్‌ వెళితే చాలు వైడ్‌ గా ప్రకటిస్తారు. షాట్‌ ఆడే సమయంలో బ్యాటర్‌ పక్కకు జరిగినా దానిని పెద్దగా ప్రకటించుకోరు. ఈ క్రమంలో వైడ్‌ విషయంలో బౌలర్లకు అన్యాయం జరుగుతూ వస్తోంది. ఇకపై బంతిని విడుదల చేసే సమయంలో బ్యాటర్‌ కాలు ఎక్కడ ఉందనే దానిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఐపీఎల్‌లో ఇప్పటికే ఈ తరహా రూల్‌ అమలులో ఉంది. తాజాగా దానినే ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఉపయోగించనుంది.ఇక కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విషయంలోనూ మార్పు ఉండనుంది. గతంలోలాగా ఎవర్ని పడితే వారిని కంకషన్‌ సబ్‌ స్టిటూట్‌గా చేసే అవకాశం లేదు. ముందే పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విషయంలో ఎలా అయితే పేర్లు ఇస్తారో.. కంకషన్‌ సబ్‌ స్టిట్యూట్‌కు కూడా ఇవ్వాల్సి ఉంది. ఆటలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో ఉన్న ప్లేయర్లలో ఎవరికైనా తలకు గాయమై ఆడలేని స్థితిలో ఉంటే అప్పుడు కంకషన్‌ సబ్‌ స్టిట్యూట్‌ నుంచి రీప్లేస్‌ చేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News