Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణముగిసిన పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు

ముగిసిన పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు

జంట నగరాల్లో ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 90 శాతానికి పైగా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్నికల నిర్వహణ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఫలితాల్లో ఇంద్రాల రాజు అధ్యక్షుడిగా, రుద్రవరం శేఖర్ ప్రధాన కార్యదర్శిగా, రుద్రవరం ప్రసాద్ కోశాధికారిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అదేవిధంగా కొండోజు జనార్ధన చారి మరియు దాసోజు అనిల్ కుమార్ ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక కాగా, పులిగిల్ల వినోద్ మరియు కోడూరు వినోద్ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు. ధర్మకాంట చైర్మన్ గా ఎర్రోజు బిక్షపతి, పంచాయితీ చైర్మన్గా రామంచర్ల కమలయ్య మరియు సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్గా అవుసుల శేఖర్ విజయం సాధించారు. భవనం చైర్మన్ గా పానుగంటి విష్ణు మరొకసారి ఎన్నికయ్యారు. గెలుపొందిన ప్రతి ఒక్కరూ పాట్ మార్కెట్ లోని ప్రతి స్వర్ణకార దుకాణం కి వెళ్లి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News