Friday, October 3, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్ఫ్రీగా డేటా ఇంజినీర్ కోర్సు, ప్లేస్‌మెంట్

ఫ్రీగా డేటా ఇంజినీర్ కోర్సు, ప్లేస్‌మెంట్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా డేటా ఇంజినీర్ కోర్సు ప్రకటన విడుదలైంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిరుద్యోగ యువత కోసం శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు 2022-2025 మధ్య BSc, MSc, B.Tech, M.Tech, లేదా MCA పూర్తిచేసిన పట్టభద్రులు అర్హులు.

ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ & అడ్వాన్స్‌డ్ పైథాన్, SQL, BI టూల్స్‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్‌లో 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. తరగతులు హైదరాబాద్‌లోని సత్యసాయి స్కిల్ సెంటర్‌లో ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్ సహాయం కూడా అందిస్తారు.

ఆసక్తి ఉన్నవారు www.sethu.ai లో నమోదు చేసుకోవచ్చు లేదా 9052372023 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News