Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్ఇండియాలో టెస్లా మొదటి షోరూం.. జులైలో ప్రారంభం..

ఇండియాలో టెస్లా మొదటి షోరూం.. జులైలో ప్రారంభం..

ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా మన దేశంలో ఫస్ట్ షోరూమ్‌ను జులైలో ప్రారంభించనుంది. వచ్చే నెల ప్రథమార్థం కల్లా ముంబైలో ఓపెన్ కానుంది. ఇండియా ఆర్థిక ముంబై తర్వాత జాతీయ రాజధాని ఢిల్లీలోనూ సేల్స్ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చైనాలో ఉన్న తన ఫ్యాక్టరీలో తయారుచేసిన కార్లతో టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఆ కంపెనీకి చెందిన ‘మోడల్‌ వై’ రేర్‌ వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీ కార్లు ఇప్పటికే మన దేశానికి చేరుకున్నాయని తెలుస్తోంది. ‘మోడల్‌ వై’ అనేది ప్రపంచంలో ఎక్కువగా విక్రయమవుతున్న విద్యుత్ కారు. దీన్ని అమెరికాలో 44,990 డాలర్లకు అమ్ముతోంది. ఇండియా‌లో ఈ రేటు 56 వేల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News