Friday, September 12, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్NPCILలో 337 అప్రెంటీస్‌లు

NPCILలో 337 అప్రెంటీస్‌లు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 337 మందికి ఏడాది అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్ 122 వేకెన్సీలు, డిప్లొమా అప్రెంటీస్ 94 ఖాళీలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 121 సీట్లు ఉన్నాయి. 2025 జులై 21లోపు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్‌లకు నెలకు రూ.7700, డిప్లొమా అప్రెంటీస్‌లకు రూ.8 వేలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లకు రూ.9 వేలు స్టైపెండ్ ఇస్తారు.

ట్రేడ్ అప్రెంటీస్‌లకు ఐటీఐ, డిప్లొమా అప్రెంటీస్‌లకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ లేదా బీఏ, బీకామ్, బీఎస్సీ తదితర కోర్సులు చదివినవారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్2.0 (ఎన్ఏపీఎస్2.0) లేదా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్2.0 (ఎన్ఏటీసీ2.0) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు www.npcil.nic.inను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News