Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణపెట్రోల్ అమ్మకంలో చంచ‌ల్‌గూడ జైలుకు అవార్డు

పెట్రోల్ అమ్మకంలో చంచ‌ల్‌గూడ జైలుకు అవార్డు

అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్

తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న కేంద్ర కారాగారం చంచ‌ల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి ఉత్తమ పెట్రోల్ బంక్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డును డివిజనల్ సేల్స్ జనరల్ మేనేజర్ సుబ్రతో రాయ్ చేతుల మీదుగా చంచల్‌గూడ‌ జైలు పర్యవేక్షణాధికారి శివకుమార్ గౌడ్ అవార్డు అందుకున్నారు. ఈ సంధర్బంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ వరసగా ఉత్తమ పెట్రోల్ బంక్ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. పెట్రోల్ అమ్మకాల వాళ్లు వచ్చిన లాభాలని ఖైదీల సంక్షేమం మరియు జైళ్ల శాఖ అభివృద్దికి ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సేల్స్ అధికారులు, చంచల్ గూడ జైలు జైలర్ దేవ్ సింగ్, హెడ్ వార్డర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News