Thursday, September 19, 2024
spot_img

వరదలతో సిక్కిం అతలాకుతలం

తప్పక చదవండి
  • 100 మంది గల్లంతు.. ముమ్మర గాలింపు
  • గల్లంతైన వారిలో 23మంది ఆర్మీ సిబ్బంది మృతదేహాలు లభ్యం
  • 15 మంది జవాన్ల కోసం తీవ్ర అన్వేషణ
  • 1,471 పర్యాటకులను రక్షించిన ఆర్మీ

సిక్కిం : ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదల ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగింది. ఈ వరదల్లో 100 మందికిపైగా గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రధాన వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వారికోసం ఎన్టీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో లాచెన్‌ లోయలోని తీస్తా నదికి భారీగా వరద వచ్చి చేరడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది బేసిన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 103 మంది గల్లంతయ్యారు. వారిలో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ వరదల్లో గల్లంతైన 23 మంది ఆర్మీ సిబ్బందిలో ఏడుగురి మృతదేహాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరిని సురక్షితంగా రక్షించారు. తప్పిపోయిన 15 మంది జవాన్ల కోసం అన్వేషణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌ తెలిపారు. తీస్తా బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇక గల్లంతైన 103 మందిలో పాక్యోంగ్‌లో 59 మంది, గ్యాంగ్‌టక్‌లో 22 మంది, మంగన్‌లో 17 మంది, నామ్చిలో 5 గురు ఉన్నారు. అదేవిధంగా ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలోని 13 వంతెనలు ధ్వంసమమైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఒక్క మంగన్‌ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు పూర్తిగా కొట్టుకుపోయినట్లు చెప్పారు.

గ్యాంగ్‌టక్‌లో మూడు, నామ్చిలో రెండు వంతెనలు ధ్వంసమైనట్లు వివరించారు. పలు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరణ చేపడుతున్నారు. చుంగ్తాంగ్‌ పట్టణం ఈ వరదలకు భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ వరదలకు 80 శాతం మేర తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రానికి జీవనాధారంగా భావించే 10వ నంబర్‌ జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతింది. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3,000 మందికిపైగా పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్‌ తెలిపారు. ఇప్పటి వరకూ లాచెన్‌, లాచుంగ్‌, చుంగ్తాంగ్‌ ప్రాంతాల నుంచి 1,471 మంది పర్యాటకులను ఆర్మీ రక్షించింది. రాష్ట్రంలో నేడు వాతావరణం మెరుగుపడే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరింత మంది పర్యాటకులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఇక వరద ప్రభావత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు సుమారు 2,411 మందిని తరలించారు. వారందరినీ సహాయక శిబిరాల్లో ఉంచారు. అయితే ఈ విపత్తుకు 22,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమైనట్లు సిక్కిం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ూూఆఓం) తన తాజా బులెటిన్‌లో తెలిపింది. ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన పౌరులు, పర్యాటకులకు ఆహారం, వైద్య సహాయం, కమ్యూనికేషన్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు భారత సైన్యం సహాయం అందిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు