Tuesday, October 28, 2025
ePaper
Homeబిజినెస్చమురు ధరలకు రెక్కలు

చమురు ధరలకు రెక్కలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణం

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ఇండియన్ ఆయిల్ మార్కెట్‌ పైన, గ్యాస్‌ కంపెనీల పైన పడే అవకాశం ఉంది. ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్‌కు 73 నుంచి 74 డాలర్లు పలుకుతోంది. అయినా ఆయిల్ మార్కెట్‌ కంపెనీల ఆదాయం ప్రభావితమవుతోంది. మరోవైపు.. అప్‌స్ట్రీమ్ సంస్థల ఆదాయం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముడి చమురు ధర పెరిగితే ఎల్‌ఎన్‌జీ రేటు కూడా పెరుగుతుంది. ఈ చమురు ధరల పెరుగుదల ఇప్పటికీ ఈ ఏడాదిలో జరిగిన పెరుగుదల కన్నా తక్కువే.

ప్రస్తుత పెరుగుదల గత 4 ఏళ్ల సరాసరి కన్నా చాలా తక్కువ కావటం గమనార్హం. ఇప్పుడు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 75 డాలర్లు. చమురు ధరలు పెరగటానికి.. హార్ముజ్ జల సంధిలో తీవ్రమవుతున్న సంక్షోభం ఒక కారణం. ఈ జలసంధి ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో ఒకటి. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌ను కలుపుతుంది. ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వెళుతుంది. ఇండియా చమురు దిగుమతుల్లో మూడింట 2 వంతుల కన్నా ఎక్కువ. ఈ మార్గంలో ఆటంకాలు ఏర్పడితే ఇండియా ఇతర వనరులు, మార్గాల కోసం వెతకాల్సి వస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News