Tuesday, October 28, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్‌లోని మన దేశ పౌరులకు సూచనలు

ఇరాన్‌లోని మన దేశ పౌరులకు సూచనలు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయాన్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలని తెలిపింది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని కోరింది. ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో కావాలని పేర్కొంది. స్థానిక అధికారుల చెప్పే భద్రతా నిబంధనలను పాటించాలని కోరింది. ఇండియన్ పౌరులు తమ వివరాలను నమోదుచేయాలని పేర్కొంటూ ఒక దరఖాస్తును పోస్ట్ చేసింది. లోకల్ పరిస్థితులపై లేటెస్ట్ సమాచారాన్ని తెలిపేందుకు టెలిగ్రామ్ లింక్‌ను షేర్‌ చేసింది. హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా పోస్ట్‌లో‌ అందుబాటులో ఉంచింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News