Friday, October 3, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్నీట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థినికి మాజీ మంత్రి రోజా ప్రశంస

నీట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థినికి మాజీ మంత్రి రోజా ప్రశంస

విద్యా ఖర్చులు చెల్లిస్తున్న మాజీ మంత్రి రోజా గారు

రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కే.రోజా గారు నీట్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అభినందించడంతో పాటు మెడిసిన్ చదువుకు అయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథ రెడ్డి కుమార్తె ఇ.జయశ్రీ నీట్ ప్రవేశ పరీక్ష లో 95.86% తో 471 మార్కులు సాధించారు. జయశ్రీని అభినందించడం తో పాటు తన చదువుకు అయ్యే ఖర్చును భరిస్తారని మాజీ మంత్రి రోజా గారు భరోసా ఇచ్చారు.

కాగా తిరుపతి చైతన్య జూనియర్ కళాశాలలో గత రెండేళ్లుగా ఇంటర్మీడియట్ చదువుకు అయిన ఖర్చును కూడా మంత్రి గారే చెల్లించడం విశేషం. ఈ విషయమై పలువురు మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా గారి ఉదారతను ప్రశంసిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News