Monday, October 27, 2025
ePaper
Homeబిజినెస్ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్‌లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీఎస్ మోపెడ్ నుంచ్ అడ్వాన్స్ టూవీలర్ వాహనాల వరకు అందుబాటులోకి వచ్చాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు కూడా టీవీఎస్ ద్వారా వస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీవీఎస్ బ్రాండ్ ఇమేజ్ మోటర్ ఫీల్డ్‌లో ప్రజల విశ్వాసం పొందాలని ఆకాంక్షించారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందని, ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలపై టాక్స్ మినహాయింపు ఇచ్చిందని చెప్పారు.

హైదరాబాదులో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అమలుచేస్తున్న ఈవీ పాలసీని ఉపయోగించుకోవాలని సూచించారు. టూ వీలర్స్ రంగంలో ఒక విప్లవం లాగా విద్యుత్ వాహనాలు రావాలని కోరారు. ఓఆర్ఆర్ లోపల టూవీలర్, త్రీ వీలర్ ఆటోలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు కావాలని ఆశిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News