Saturday, October 4, 2025
ePaper
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాతీయ ఉద్యానవనంలో వరుసగా మూడో రోజు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారు. 2 ఏకే 47 రైఫిళ్లను, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి.

నేషనల్ పార్క్‌ ఫారెస్ట్ ఏరియాని మావోయిస్టులు సేఫ్ సైడ్‌గా భావించి ఇక్కడ తిష్టవేశారని భద్రతా బలగాలు పసిగట్టాయి. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు. కర్రెగుట్టల నుంచి మొదలుపెట్టి అబూజ్‌మడ్ పర్వతాలు సహా నేషనల్ పార్క్‌ను స్కానింగ్ చేస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా సైతం ఇక్కడే ఉన్నట్లు భావిస్తున్నారు. అతణ్ని టార్గెట్‌గా చేసుకొని ఆపరేషన్ కగార్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News