Tuesday, October 28, 2025
ePaper
Homeఆరోగ్యంగుడ్డులో ఏమేం ఉంటాయి?

గుడ్డులో ఏమేం ఉంటాయి?

గుడ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. వీటిలో పోషకాలు సంవృద్ధిగా ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 70 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, ఏ డీ బీ12 విటమిన్లు, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఫాస్పరస్ తదితర విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మెదడుకు కావాల్సిన కోలిన్‌ సైతం దొరుకుతుంది. గుడ్డులోని ప్రొటీన్‌ శరీర కణజాలాల నిర్మాణానికి, మరమ్మత్తుకు అవసరం. అమైనో ఆమ్లాలను ఇస్తుంది. రోజూ 2 గుడ్లు తినటం వల్ల ప్రొటీన్ లభిస్తుంది.

కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా గుడ్లు ఉపయోగకరంగా ఉంటాయి. గుడ్లు తింటే పక్షవాత ప్రమాదం తగ్గుతుంది. గుండె సమస్యతో బాధపడేవాళ్లు గడ్డులోని సొన తినటం మంచిది కాదు. గుడ్లలోని పచ్చసొనలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రెటీనాలో పేరుకుపోయి హానికర నీలి కాంతి నుంచి రక్షిస్తాయి. గుడ్లు తింటే బరువు తగ్గుతారు. గుడ్డులో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి కడుపు నిండిన ఫీలింగ్‌ వస్తుంది. గుడ్లలో ఉండే విటమిన్‌ డీ ఎముకల ఆరోగ్యానికి అవసరం. దంతాలకు కావాల్సిన కాల్షియాన్ని శరీరం గ్రహించడానికి విటమిన్ డి దోహదపడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News