Saturday, October 4, 2025
ePaper
Homeఆరోగ్యంకంట్రోల్ యువర్ బీపీ

కంట్రోల్ యువర్ బీపీ

బీపీ ఎక్కువగా ఉంటే హార్ట్, బ్రెయిన్, కిడ్నీలకు ప్రమాదం. మన దేశంలో వయసు మీదపడ్డవారిలో పాతిక శాతం కన్నా ఎక్కువ మందికి హైబీపీ ఉంది. దీనికి కారణం.. వంశపారంపర్యం, వయసు, ఆహార అలవాట్లు, డైలీ లైఫ్ స్టైల్. ధమని గోడలపై రక్తం ఒత్తిడినే రక్తపోటు అంటారు. సోడియం లెవల్ పెరిగితే రక్తపోటు వస్తుంది. నూడుల్స్, ప్యాక్ చేసిన ఫుడ్, రెస్టారెంట్ మీల్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పదార్థాలను తగ్గించాలి. రోజులో ఎక్కువ సేపు శారీరక శ్రమకు దూరంగా ఉంటే జీవక్రియ మందగిస్తుంది. ఆ ఎఫెక్ట్‌తో బరువు పెరుగుతారు. ఈ రెండూ హైబీపీకి దారితీస్తాయి. అందువల్ల డైలీ అర్ధ గంట నడవాలి.

కాఫీని లిమిట్‌గా తాగాలి. రోజులో ఎక్కువ సార్లు కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగితే బీపీ పెరుగుతుంది. అప్పటికే బీపీ ఉన్నవాళ్లకు ఈ ఇంకా డేంజర్. నిద్ర సరిపోను లేకపోతే హార్మోన్ కంట్రోల్ తప్పుతుంది. రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. ఒత్తిణ్ని తగ్గించుకోకపోతే రక్తపోటు వస్తుంది. దీనికోసం వ్యాయామం చేయాలి. ఫ్రెండ్స్‌తో గడపాలి. బీపీని రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News