Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణమాజీ గవర్నర్‌ తమిళసైకి పితృ వియోగం

మాజీ గవర్నర్‌ తమిళసైకి పితృ వియోగం

సంతాపం తెలిపిన సిఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌(tamilisai soundaryarajan) తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్‌ (Kumari Ananthan) (హరికృష్ణన్‌ నాడార్‌ అనంతకృష్ణన్‌) మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు, తమిళ భాషా ప్రేమికుడు, అనంతన్‌ గారిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు. కుమారి అనంతన్‌ నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న తమిళ సై కి, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. అనంతన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News