Friday, October 18, 2024
spot_img

సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

తప్పక చదవండి

సింగపూర్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాలులో ప్రతి ఏడాది మాదిరిగానే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది బాలబాలికలు పాల్గొని భక్తిశ్రద్ధలతో బాల గణెళిశుడిని ఆరాధించారు. 21 పత్రాలతో గణపతిని పూజించారు. వినాయక చవితి విశిష్టత, తెలుగువారి సంప్రదాయాల గురించి పెద్దల నుంచి తెలుసుకున్నారు. గణపతి పూజ అనంతరం ఉత్సాహంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూను వీర గ్రూప్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాలను అందించామని బొమ్మారెడ్డి శ్రీనివాసులు తెలిపారు. అలాగే సుమారు 800 మందికి 21 రకాల పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామన్నారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలకు చేయూతనిస్తూ అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలు రూపొందించబోతున్నామని తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాన్ని సుమారు 500 మంది ప్రత్యక్షంగా.. 5వేల మంది ఆన్‌లైన్‌లో వీక్షించారని కార్యక్రమ నిర్వాహకులు ఆలపాటి రాఘవ వెల్లడిరచారు. ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయసహకారాలు అందించారని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన కార్యవర్గ సభ్యులకు, దాతలకు, పూజలో పాల్గొన్న వారికి, స్వచ్ఛంద సేవకులకు సమాజం కార్యదర్శి అనిల్‌ కుమార్‌ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు