Monday, October 27, 2025
ePaper
Homeఅంతర్జాతీయంసునీతా విలియమ్స్‌కు లైన్‌ క్లీచర్‌

సునీతా విలియమ్స్‌కు లైన్‌ క్లీచర్‌

  • రోదసీలోకి దూసుకెళ్లిన ఫాల్కన్‌

మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమీ మీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు తాజాగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న విషయం తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్‌ ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్‌ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో నికోల్‌ అయర్స్‌, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ వ్యోమగాములు ఉన్నారు. 2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌లు చేరుకున్నారు. స్టార్‌లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరింది. దీంతో వారిని తీసుకురావడానికి పలు అవాంతరాల దాదాపు తొమ్మిది నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు పంపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News