Saturday, October 4, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంబరితెగించిన బీఆర్‌ఎస్‌ గుండా లీడర్‌

బరితెగించిన బీఆర్‌ఎస్‌ గుండా లీడర్‌

  • మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో జవహర్‌నగర్‌లో హైటెన్షన్‌
  • పట్టపగలు మున్సిపల్‌ అధికారులు, ప్రజలంతా చూస్తుండగానే ఘటన
  • నందనవనం పార్క్‌ స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యం
  • రౌడీలను పెట్టి, పార్క్‌ బోర్డ్‌ను కూల్చివేసిన దుర్మార్గం
  • ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన బీఆర్‌ఎస్‌ లీడర్‌

కొండల్‌ ముదిరాజ్‌ ఇతగాడు లీడర్‌గా అవతారమెత్తాడు.. ఇంతకు ఎవరు ఇతను..? ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎవరి అండతో ఇంత దౌర్జన్యంగా పట్టపగలే అధికారులను సైతం లెక్కచేయకుండా నడి రోడ్డుపై విరంగం సృష్టిస్తూ.. రౌడీ గ్యాంగ్‌ ను పెట్టుకుని మరీ దౌర్జన్యంగా స్థలాలు కబ్జా చేస్తున్నాడు..? ఇతగాడు మహబూబ్‌ నగర్‌ నుంచి 15 సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం జవహర్‌ నగర్‌ ప్రాంతానికి వలస వచ్చి పాన్‌ షాప్‌ పెట్టుకుని, కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతికేవాడు.. నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి, బహుళంతస్తుల బిల్డింగ్‌లు ఏర్పాటు చేసుకొని సిస్టంకే సవాల్‌ విసురుతూ సంచలనం సృష్టిస్తున్నాడు..

జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని.. సర్వేనెంబర్‌ 510, 17 గుంటల ప్రభుత్వ స్థలంలో పార్కు ఏర్పాటు చేసి లక్షల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నేడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు జవహర్‌ నగర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌ తన అనుచరులతో, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రజలంతా చూస్తుండగానే పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించేదుకు యత్నించాడు.. ఈ విషయం తెలుసుకున్న జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. దిష్టిబొమ్మల్లా నిల్చుని చోద్యం చూస్తూ ఉండిపోయారు.. తమకేమీ పట్టనట్టు వెనక్కి తిరిగి వచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ బీఫామ్‌ తీసుకున్న నేతలు గెలిచినా.. ఓడిన వారితోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయిస్తాం అన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాటలు నీటిమీద మూటలేనా..? అంటూ ప్రజలు గుస గుసలాడుతున్నారు.. కాగా జవహర్‌ నగర్‌ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గోపాల్‌ ముదిరాజ్‌ ఓ అమాయక వ్యక్తిని మోసం చేయడంతో.. అతను అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ కేసు ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో నమోదు అయింది..

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 27/5 /2021లో మున్సిపల్‌ కమిషనర్‌ గోపి ఐఏఎస్‌, కీసర ఆర్డీవో రవి, తహసిల్దార్‌ గౌతమ్‌ కుమార్‌, జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నాగేష్‌ బాబులు జాయింట్‌ సర్వే చేసి 510 సర్వేనెంబర్‌ 17 గుంటల స్థలంలో నందనవనం పార్క్‌ గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.. అనంతరం అటి స్థలంలో డెవలప్మెంట్‌ కొరకు 30 లక్షల రూపాయిలతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసింది.

కాగా బుధవారం రోజు బీఆర్‌ఎస్‌ గుండా కొంతమంది రౌడీలతో ప్రజలంతా చూస్తుండగానే గడ్డపారలు, పెద్ద పెద్ద కర్రలు, మారణాయుధాలు తీసుకొచ్చి.. ప్రభుత్వ స్థలంలో బోర్డులు కూల్చివేసి.. స్థలం కబ్జా చేసేందుకు యత్నించాడు.. ఇంతటి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మున్సిపల్‌ అధికారులు.. పార్క్‌ స్థలాలను కబ్జాకోరులకు వదిలేసి తోకముడుచుకుని వెళ్లిపోయారు.. ప్రజల పన్నులతో ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పబ్బం గడుపుతూ సమాజంలో సిగ్గులేకుండా జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌.. గడుపుతున్నాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

నియోజకవర్గం కాంగ్రెస్‌ కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే వజ్రేష్‌ యాదవ్‌ ఎక్కడ..?
మేడ్చల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాన అనుచ రుడైన కొండల్‌ ముదిరాజ్‌ కొంతమంది రౌడీల ను వెంట బెట్టుకుని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి రౌడీలపై ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు..? ఓడిపోతే ఇంటికే పరిమితమా..? కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇతగాడు వేస్ట్‌ అంటున్నారు జవహర్‌ నగర్‌ ప్రజలు..

RELATED ARTICLES
- Advertisment -

Latest News