Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణధర్మాన్ని కాపాడడంలో దేవాలయాలు ఎంతో అవసరం

ధర్మాన్ని కాపాడడంలో దేవాలయాలు ఎంతో అవసరం

  • హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
  • కొండపొచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
  • ఆలయ అభిృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ

కొండపొచ్చమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడిని అయ్యానని భావిస్తున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో లో నిర్వహించిన సన్మాన కార్యక్రమం లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తో మెదక్ ఎంపి రఘునందన్ రావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి లోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం తీగుల్ నర్సాపూర్ లోని శ్రీ కొండపోచమ్మా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కొండపొచమ్మ ఆలయానికి చాలా విశిష్టత ఉందనీ, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం లో దేవాలయాలు ఎంతో అవసరం అని అన్నారు. సమాజానికి సేవ చేసే బాధ్యత కూడా తనకు ఉందనీ, అన్నింటికన్నా ముఖ్యమైనది విద్య ,ఎవరెన్ని డబ్బులు ఇచ్చ్చిన మన దగ్గర ఉండవు కానీ విద్యా మనం ఉన్నంతవరకు ఉంటదన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News