Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 41,268 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో వీర రాఘవులుపై పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News