Wednesday, October 29, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ఈ సమావేశాలు ఎవ‌రి కోసం..

ఈ సమావేశాలు ఎవ‌రి కోసం..

మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న శ్రద్ద.. ప్రజాచట్టాలు చేయడంలోలేదు! ప్రజలకు జవాబుదారీతనంలో పాలక, ప్రతిపక్షాలు దొందూ దొందే? రాజ్యాంగాన్ని విస్మరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సభ నిర్వహణ పేరుతో ప్రజాధనం,కాలం వృధాయే.. ప్రజా ప్రయోజనాలు పట్టించుకోని సభ(భ్యు)లను రీ కాల్‌ చేయగలిగే సవరణ రావాలి..

  • మేదాజీ
RELATED ARTICLES
- Advertisment -

Latest News