Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుహుస్సేన్‌సాగర్‌ ప్రమాద ఘటనలో ఒకరి మృతి

హుస్సేన్‌సాగర్‌ ప్రమాద ఘటనలో ఒకరి మృతి

  • గల్లంతైన యువకుడి కోసం విస్తృతంగా గాలింపు

హుస్సేన్‌సాగర్‌ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం భారతమాతకు హారతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరుగగా బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గణపతి మంగళవారం మృతిచెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే బోటు ప్రమాదం సమయంలో గల్లంతైన యువకుడు అజయ్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. రెండో రోజు హుస్సేన్‌సాగర్‌లో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News