Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ కొత్త ఉత్పత్తి మైలురాయి

అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ కొత్త ఉత్పత్తి మైలురాయి

హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ యొక్క ఐస్‌ క్రీమ్స్‌ బ్రాండ్‌ అయిన అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌, గోవిందపూర్‌ ఫెసిలిటిలో రోజుకు 1.27 లక్షల కిలోల ఐస్‌ క్రీమ్స్‌ ఉత్పత్తి చేస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. పెరుగుతున్న వినియోగదారుల డిమా ండ్‌ను తీర్చడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబి స్తుంది. 2022లో స్థాపించబడిన గోవిందపూర్‌ ప్లాంట్‌ 113 ఎకరాలను విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఐస్‌ క్రీమ్‌ తయారీ యూనిట్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్లాంట్‌ అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతికతతో పాటు అదునాతన పరికరాలను కలిగి ఉంది. ఈ మైలురాయిని పురస్క రించుకుని, 2025 జనవరి 27న గోవిందపూర్‌ ఫెసిలిటిలో అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ ‘‘కిడ్స్‌ అడ్వెంచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం’’ ను నిర్వహించింది. 2025 జనవరి 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం, పిల్లలకు స్థిరత్వం మరియు ఐస్‌ క్రీమ్స్‌ తయారీపై అవగాహన కల్పించడంతోపాటు సంతోషకరమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టు కుంది. హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ పద్మశ్రీ ఆర్‌. జి. చంద్రమోగన్‌ ఈ మైలురాయి గురించి మాట్లాడుతూ ‘‘ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం, మా కార్యకలాపాల్లో అధునాతన సాంకేతికత, స్థిరత్వం పట్ల మాకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబి స్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News