Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణకరీంనగర్ కవులకు అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కారాలు

కరీంనగర్ కవులకు అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కారాలు

చిట్టి కవితల అక్షర అగ్నికీలకం ప్రభాకర్ జయంతి సందర్భంగా కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల వారు అలిశెట్టి పురస్కారాలను కరీంనగర్ జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెల్ల మురళి, మధు పొన్నం రవిచంద్ర ల‌కు అవార్డులు ప్రధానం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీగా పక్షాలు అడ్డువాల జ్యోతి ఈ అవార్డులను ప్రదానం చేస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు. కరీంనగర్ జిల్లా కవులకు అవార్డు రావడం పట్ల పలు సాహితీ సాంస్కృతిక సంస్థలు అవార్డు గ్రహీతల‌ను అభినందించారు. ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు మాట్లాడుతూ.. నిజాయతీ పరుడైన అలిశెట్టికి సాహిత్య రంగంలో సాటి ఎవ్వరూ లేరన్నారు. సామాజిక బాధ్యతతో సాహిత్య సృజన చేసి చిన్న వయసులోనే తనువు చాలించాడంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కరీంనగర్ అకాడమీ అధ్యక్షుడు జి. కృపాదానం, నట సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు రోడ్డ యాదగిరి, మాడిశెట్టి గోపాల్, గాయకులు కాసుమహేంద్రరాజు, సల్వాజి ప్రవీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News