Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఅర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

  • లారీని ఢీకొట్టిన బస్సు…అక్కడికక్కడే ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైర్‌ బరస్ట్‌ కావడంతో డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. అప్రమత్తమైన లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News