Sunday, October 5, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలు8 మందికి ఒక రోజు జైలు శిక్ష

8 మందికి ఒక రోజు జైలు శిక్ష

బోధన్‌ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్‌ నగర్‌కు చెందిన యాసీన్‌ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ తెలిపారు. పట్టణంలోని ఆజాం గుంజ్‌ లోని పక్క పక్క ఇల్లు గల కుటుంబ సభ్యులు గొడవ పడి పబ్లిక్‌ న్యూసెన్స్‌ చేస్తున్న ఇరు కుటుంబ సభ్యులు నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా వారికి కూడా ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News