- విద్యతో పాటు విలువల పండుగగా విద్యార్థుల ప్రదర్శనలు…
నగరంలో సీతారాంపూర్ లోని ఐ వి వై విద్యాసంస్థలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్, డైరెక్టర్ పసుల జయశ్రీ ప్రిన్సిపల్ కోల మాలతి ఆధ్వర్యంలో సంస్కృతిక, సృజనాత్మకత, మరియు విద్యార్థుల ప్రతిభతో అట్టహాసంగా జరిగాయిఈ సందర్భంగా పాఠశాల ఆవరణ దేశ జెండా రంగులతో కళకళలాడింది. వ్యవస్థాపకులు పసుల మహేష్ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను సృజనాత్మకంగా విద్యార్థులకు వివరించారు .

గణతంత్ర దినోత్సవ అంటే కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే కాదు. మన హక్కులు, బాధ్యతలు మరియు దేశ సేవ పట్ల మన కర్తవ్యాన్ని గుర్తుచేసే రోజు అని వారు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు, డ్రామాలు, ఎస్సే రైటింగ్, డిబేట్, టెడ్ ఎడ్, మరియు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో తమ ప్రతిభను చాటారు. చిన్నారులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణతో ఆకట్టుకున్నారు .
గెలుపొందిన విజేతలకు పాఠశాల చైర్మన్ గారు మెడల్స్, మరియు ప్రశంసా పత్రాలు అందజేసి వారిని అభినందించారు. విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యత, మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం నిలిచి పాఠశాల ఆవరణం అంతా పండుగ వాతావరణం నెలకొంది .
