నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఆర్‌బీ
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ(Telangana Forensic Science Laboratory)లో 60 పోస్టులకు నోటిఫికేషన్ (Notificaion) జారీ అయింది. సైంటిఫిక్ ఆఫీసర్స్(Scientific Officers), సైంటిఫిక్ అసిస్టెంట్స్ (Scientific Assistants), ల్యాబ్ టెక్నీషియన్స్(Lab Technicians), ల్యాబ్ అసిస్టెంట్స్(Lab Assistants) పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Telangana Police Recruitment Board) వెబ్‌సైట్(www.tgprb.in)లో చూడాలని అధికారులు తెలిపారు.
- Advertisement -
