Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలు6 లక్షల విలువైన ఇ-సిగరెట్ల స్వాధీనం

6 లక్షల విలువైన ఇ-సిగరెట్ల స్వాధీనం

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు శనివారం (మే 31న) రూ.6 లక్షల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఇ-సిగరెట్‌లను విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు బ్రాండ్‌ల సిగరెట్లతోపాటు 2 బైక్‌లను, 3 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను.. మంగల్‌హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్, మల్లేపల్లి ఏరియాకి చెందిన ఆమీర్ ఖాన్, సంతోష్‌ నగర్ ప్రాంత వాసి మొహమ్మద్ అసద్‌గా గుర్తించారు. ఎక్కువ రాబడి కోసం ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీకి చెందిన షాకీర్‌కి ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటూ సరుకు దిగుమతి చేసుకున్నారు. ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ చోట.. ఢిల్లీ నుంచి వచ్చిన సిగరెట్ల ఆర్డర్‌ను తీసుకోవడానికి వచ్చిన నిందితులను అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News