Friday, February 13, 2026
HomeజాతీయంUDF | మూడు పార్టీల చేరిక

UDF | మూడు పార్టీల చేరిక

వచ్చే ఏడాది కేరళ(Kerala)లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(UDF)ను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా నాయకత్వం సోమవారం మూడు రాజకీయ పార్టీలను కూటమిలోకి చేర్చుకుంది. అవి.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(AITC), జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ(JRP), వైకుంఠ స్వామి ధర్మ ప్రచార సభ(VSDPS). ఈ అంశంపై యూడీఎఫ్ చైర్మన్, ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ మీడియాతో మాట్లాడారు. ఈ మూడింటిలో ఏ పార్టీ కూడా ఫ్రంట్‌లో చేరటానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని తెలిపారు. ‘వారు ఒక అభ్యర్థనతో మమ్మల్ని సంప్రదించారు. సమావేశంలో ఇతర మిత్ర పక్షాలతో చర్చించి, వారిని కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News