ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh)లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు(Surrender). భారీగా ఆయుధాల(Weapons)ను స్వాధీనం చేశారు. అంతా గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరేబేడా అటవీ ప్రాంతం (Farest Aria) నుంచి సుమారు 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి లొంగిపోవటానికి బరేబేడా గ్రామానికి చేరుకున్నారు. వీరిని వాహనాల్లో భానుప్రతాప్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మావోయిస్ట్ లీడర్ రామ్ దేర్ తన టీమ్‌తో కలిసి లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు, 8 మంది పురుషులు ఉన్నారు. 18 ఆయుధాలను అప్పగించారు. నలుగురు డివిసిఎం, 9 మంది ఏ.సి.ఎం, 8 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు.
