2026 మార్చి చివరి లోపు ప్రారంభం
యూకో బ్యాంక్ (UCO Bank) పేరును చాలా మంది వినే ఉంటారు. కానీ.. ఆ బ్యాంక్ బ్రాంచ్‌లను మాత్రం ఎక్కువ శాతం మంది చూసి ఉండరు. యూకో బ్యాంక్ బ్రాంచ్‌ల సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణం. అందువల్ల ఆ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial Year) ముగిసే లోపు.. అంటే.. 2026 మార్చి చివరి నాటికి మరో 150 బ్రాంచ్‌లను ఓపెన్ చేయనున్నట్లు యూకో బ్యాంక్ ప్రకటించింది.
దేశీయంగా తమ ఉనికిని, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని యూకో బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ (CEO & MD) అశ్వనీ కుమార్ చెప్పారు. సంబంధిత ప్రతిపాదనకు బ్యాంక్ బోర్డు (Board) గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చిందని తెలిపారు. దీంతో యూకో బ్యాంక్ ప్రస్తుత బ్రాంచ్‌ల సంఖ్య 3 వేల 322 నుంచి 3 వేల 472కు చేరనుంది.
