స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL).. 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) (Management Trinee Technical) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కెమికల్ (Chemical) 5, సివిల్ (Civil) 14, కంప్యూటర్ (Computer) 4, ఎలక్ట్రికల్ (Electrical) 44, ఇన్‌స్ట్రుమెంటేషన్ 7, మెకానికల్ 30, మెటలర్జీ 20 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీల వారీగా చూస్తే అన్ రిజర్వ్‌డ్ 35, ఓబీసీ(ఎన్‌సీఎల్) 31, ఎస్సీ 22, ఎస్టీ 18, ఈడబ్ల్యూఎస్ 18 వేకెన్సీ ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ (65 శాతం మార్కులు) ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్(Exam), గ్రూప్ డిస్కషన్(Group Discussion), ఇంటర్వ్యూ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనంతరం ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం రూ.50 వేలు. www.sail.co.in లేదా www.sailcareers.comలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5లోపు అప్లై చేసుకోవాలి.
SAIL | సెయిల్‌లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
- Advertisement -
RELATED ARTICLES
